![]() |
![]() |

ఆలీతో ఆల్ ఇన్ వన్ షో ప్రతీ వారం నవ్వు తెప్పిస్తూ ఉంది. ఆలీని చూస్తే చాలు ఎవరైనా పగలబడి నవ్వుకోవాల్సిందే. అలాంటి ఆలీ బుల్లితెర మీద సిల్వర్ స్క్రీన్ మీద హిట్ ఐన వాళ్లందరినీ తన షోకి పిలిచి గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. ఇక ఈ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఆట సందీప్ అతని వైఫ్ జ్యోతి రాజ్, ప్రాచి వచ్చారు. జ్యోతి స్టేజి మీదకు ఎంట్రీ ఇవ్వగానే ఆలీ ఒక ప్రశ్న వేశారు "జనరల్ గా మగవాళ్ళు ఆడవాళ్ళ మీద ఫైర్ అవుతారు కానీ నువ్వెంటి రివర్స్ లో మీ ఆయన మీద ఫైర్ అవుతున్నావ్" అని అడిగేసరికి ఒక వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసింది జ్యోతి. "ప్రతీ వైఫ్ ఫైర్ అవడానికి వెనక ఒక రీజన్ ఉంటుంది.
ఆ రీజన్ ఏంటో మగవాళ్లకు తెలుసు" అని చెప్పింది. ఇక తర్వాత ఆట సందీప్ డాన్స్ చేసుకుంటూ స్టేజి మీదకు వచ్చాడు. "దెబ్బలేవీ లేవు కదా ఒంటి మీద" అని ఆలీ అడిగేసరికి "కనబడని దెబ్బలు చాలా ఉన్నాయి" అని చెప్పాడు సందీప్. ఆ మాటకు జ్యోతికి కోపం వచ్చేసింది "అవును మరి మీ మగవాళ్ళు సుద్దపూసలు.." అనేసరికి "ఈ ఎపిసోడ్ ఐపోయాక ఇద్దరూ ఇంటికి వెళ్లి ఆ పూసల సంగతేంటో తేల్చుకోండి " అన్నాడు. ఫైనల్ లో జ్యోతి రాజ్ సెట్ లో చూపించిన ఇమేజెస్ ని కలిపి స్టోరీ చెప్తూ ఉండగా ప్రాచీ వచ్చి సందీప్ భుజం మీద చెయ్యేసి నవ్వేసరికి జ్యోతి సీరియస్ ఐపోయింది. ఇక ఆలీ సందీప్ ని క్రాస్ క్వశ్చన్ వేసాడు.."పెళ్లయ్యాక అంత స్టేట్మెంట్ ఎవరూ ఇవ్వరు..పెళ్ళైనా కూడా ఇంకో అమ్మాయిని ప్రేమించొచ్చు" అని ఏ ఉద్దేశంతో అన్నావ్ అని అడిగారు.. ఆ మాటకు "చాలు" అని చెప్పి జ్యోతి రాజ్ దణ్ణం పెట్టేసింది. ఇంతకు ఆ ఎపిసోడ్ అసలు ఎం జరిగిందో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే. ‘లవ్యూ టూ’ మూవీలో సందీప్, జ్యోతి నటించారు. ఈ మూవీ ప్రొమోషన్స్ టైములో సందీప్ చేసిన కామెంట్స్ ఫుల్ ట్రోల్ అయ్యాయి.
![]() |
![]() |